మందారం పూలు( Hibiscus ) అలంకరణకు మాత్రమే కాదు కేశ సంరక్షణకు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా తోడ్పడతాయి.ముఖ్యంగా అందమైన ఆరోగ్యమైన మరియు మెరిసే ముఖ చర్మాన్ని కోరుకునేవారు మందారంతో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను తప్పకుండా ఫాలో అవ్వండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక ఐదు నుంచి ఆరు మందారం పూలు వేసి ఉడికించండి.
వాటర్ సగం అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండి( Moong Flour ) వేసుకోండి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్,( Sugar Powder ) వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా మందారం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో సున్నితంగా స్కిన్ ను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా వేసుకున్న ప్యాక్ ను తొలగించండి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి.
వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే స్కిన్ లోతుగా శుభ్రం అవుతుంది.
చర్మ కణాల్లో పేరుకుపోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గు ముఖం పడతాయి.
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల మరొక సూపర్ బెనిఫిట్ ఏంటంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది.ఫేషియల్ హెయిర్ గ్రోత్ కూడా తగ్గుతుంది.
దాంతో ముఖ చర్మం క్లియర్ అండ్ మరింత గ్లోయింగ్ గా కనిపిస్తుంది.