పోలీసులను అసభ్యపదజాలంతో దూషించిన ఘటనలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులపై సింగపూర్ పోలీసులు ( Singapore police)అభియోగాలు నమోదు చేశారు.లిటల్ ఇండియాలో ఆదివారం ఉదయం జరిగిన హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతుండగా ఈ ఘటన జరిగింది.
నలుగురు వ్యక్తులు ఓ పోలీస్ అధికారిని చుట్టుముట్టి దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.
నిందితులను డినో మార్సియానో అబ్దుల్ వహాబ్, అలెక్స్ కుమార్ జ్ఞానశేఖరన్( Alex Kumar Gnansekaran ), మొహమ్మద్ యూసఫ్ యాహియా, మోహనన్ వీ బాలకృష్ణన్‌గా గుర్తించారు.విచారణ కొనసాగుతోందని.ఈ నలుగురిపై అదనపు అభియోగాలు మోపవచ్చని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అక్టోబర్ 8న వారిని మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు.ఆదివారం తెల్లవారుజామున 5.10 గంటలకు నలుగురు వ్యక్తులు హత్య జరిగిన ప్రదేశాన్ని దాచేందుకు యత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.ఆ మార్గం మీదుగా పోలీసులను అనుమతించకుండా మరోవైపు నుంచి వెళ్లాలని చెప్పినట్లుగా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
ప్రభుత్వ అధికారులను దూషించిన ఘటనలో దోషిగా తేలిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, 5000 సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండూ విధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఆ తర్వాత నలుగురు వ్యక్తులు పోలీసులను అవహేళన చేసి, దుర్భాషలాడారని .మరోవ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో జరిగినదంతా వీడియో తీశాడని పోలీసులు వెల్లడించారు.నలుగురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించినప్పటికీ.
అధికారులు సంయమనం పాటించి పరిస్ధితులు అదుపు తప్పకుండా చూసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిపై, అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకోడబోమని పోలీసులు స్పష్టం చేశారు.
లిటిల్ ఇండియాలోని సామ్ లియోంగ్ రోడ్ వెనుక లేన్‌లో ఈ ఘటన జరిగింది.భారత సంతతికి చెందిన మొహమ్మద్ సాజిద్ సలీమ్ .వెర్డున్ రోడ్‌లో 25 ఏళ్ల యువకుడిని హత్య చేసినట్లుగా అభియోగాలు మోపారు.