అయ్య బాబోయ్.. సినిమా సీన్లకు మించి దొంగతనం..(వీడియో)

ప్రస్తుత రోజులలో ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు పాల్పడుతున్న సంఘటనలు మనం నిత్యం వార్తలలో చూస్తూనే ఉంటాం.క్షణాలలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దోచుకొని పోయిన సంఘటనలు చాలానే చూసాం.

 Theft Beyond Movie Scenes , Massive, Cinematic Style Theist ,thrissur: Gold ,2.5-TeluguStop.com

రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఫోన్స్, మహిళల్లో ఉండే బంగారు చైన్లు దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.అయితే, తాజాగా నేషనల్ హైవే ( National Highway )పై ఒక బిజినెస్ వ్యాపారి కారును వెంబడించి మరి బంగారాన్ని దోచుకొని వెళ్ళిపోయారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

త్రిశూర్‌ ( Thrissur )దగ్గర హైవేపై అతిపెద్ద భారీ దొంగతనం చోటు చేసుకుంది.దాదాపు పది మంది మూడు కార్లతో దోపిడికి పాల్పడినట్లు సమాచారం.తమిళనాడు నుంచి కేరళ వెళ్తున్న ఒక బిజినెస్ వ్యాపారినీ త్రిశూర్‌ హైవేలో అడ్డగించి ఏకంగా రెండున్నర కిలోల బంగారును కొట్టేశారు.

ఈ దొంగతనం కోసం త్రిశూర్‌ హైవేపై గోల్డ్ వ్యాపారి కారును మూడు కార్లతో దొంగలు వెంబడించి గోల్డ్ ను లాక్కొని వెళ్లారు.ఈ క్రమంలో చాలా స్పీడ్ గా బంగారు వ్యాపారి కారు వెళుతున్న కానీ.

అంతకంటే వేగంతో దొంగల కార్లు వెంటాడి బంగారును దోచేసుకున్నారు.క్షణకాల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో బంగారం లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతేకాకుండా., గోల్డ్ వ్యాపారిని( gold merchant ) కూడా వారి కారులో ఎక్కించుకొని నాలుగు కార్లతో అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.వామ్మో వీళ్లేంటి సినిమాలో దానికంటే ఘోరంగా దొంగతనానికి పాల్పడ్డారని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో ఇలాంటి దొంగతనం సంబంధించి తాము ఇంతవరకు వినలేదంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube