ఘనంగా పాఠశాలల్లో బోనాల పండగ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోచమ్మ బోనాలు( Pochamma Bonalu ) బుధవారం కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ… ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలు వండి వివిధ వేషాధారణలో బోనాలను ఊరేగింపుగా తీసుకొని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు.

 Bonala Festival In Schools-TeluguStop.com

వర్షాలు సమృద్ధిగా పడాలని అమ్మవారిని కోరుకున్నారు.పోచమ్మ బోనాల సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు , పోతరాజుల విన్యాసాలు చూపరులని ఆకట్టుకున్నాయి.

పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు, పండగలు వాటి విశిష్టతల పట్ల విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండే అవగాహన కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఏనుగుల రేణుక, కముటం స్వప్న, మెంగలి కవిత, పాహిమా, ప్రియాంక, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube