ఘనంగా పాఠశాలల్లో బోనాల పండగ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా(
Rajanna Sirisilla District ) చందుర్తి మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోచమ్మ బోనాలు( Pochamma Bonalu ) బుధవారం కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వారు మాట్లాడుతూ.ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలు వండి వివిధ వేషాధారణలో బోనాలను ఊరేగింపుగా తీసుకొని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు.
వర్షాలు సమృద్ధిగా పడాలని అమ్మవారిని కోరుకున్నారు.పోచమ్మ బోనాల సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు , పోతరాజుల విన్యాసాలు చూపరులని ఆకట్టుకున్నాయి.
పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు, పండగలు వాటి విశిష్టతల పట్ల విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండే అవగాహన కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఏనుగుల రేణుక, కముటం స్వప్న, మెంగలి కవిత, పాహిమా, ప్రియాంక, విద్యార్థులు పాల్గొన్నారు.
నా సంపాదన అంతంత మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!