స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో బాహుబలి2 సినిమాతో ప్రూవ్ అయింది.బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD )తో అశ్వినీదత్ కు 160 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం అందుతోంది.ప్రభాస్ సినిమాకు ఏకంగా ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies) కెరీర్ లో కల్కి మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.ఆగష్టు నెల 15వ తేదీ వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని చెప్పవచ్చు.ఇప్పటికీ ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో రన్ అవుతోందని సమాచారం అందుతోంది.కల్కి 2898 ఏడీ మూవీ ఇప్పటికే 1150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.
ఫుల్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.
కల్కి మూవీ కథ, కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది.కల్కి మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా నాగ్ అశ్విన్ రేంజ్ ఈ సినిమాతో ఎన్నో రెట్లు పెరిగింది.కల్కి సినిమాలో క్లైమాక్స్ సీన్లు మాత్రం అద్భుతం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.స్టార్ హీరో ప్రభాస్ ఆగష్టు నెలలో ఫౌజీ సినిమాను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది.
ఫౌజీ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రభాస్ 25వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.