ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్స్ స్టెప్ అయినా ఒకే సెకన్ లో చేస్తారు.. జాన్వీ కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.

 Janhvi Kapoor About Jr Ntr Details, Janhvi Kapoor, Jr Ntr, Tollywood, Janhvi Kap-TeluguStop.com

ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఎలాంటి పాత్ర ఇచ్చిన ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఈజీగా చెప్పడంలో ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ సాటి అని చెప్పవచ్చు.కష్టమైన డ్యాన్స్ స్టెప్ అయినా ఒక్కసారి చూసి నేర్చేసుకుంటాడని ఆయనతో పనిచేసిన వాళ్ళు చెబుతుంటారు.

తాజాగా యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.

Telugu Devara, Koratala Shiva, Janhvi Kapoor, Jr Ntr, Jr Ntr Dance, Jrntr, Tolly

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర.( Devara ) ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

ఈ సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది జాన్వీ కపూర్.జాన్వీ కపూర్ తాజాగా నటించిన హిందీ చిత్రం ఉలాజ్.

( Ulajh ) ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం.

అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తింది.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ… తెలుగువారి వర్కింగ్ స్టైల్ నాకిష్టం.

Telugu Devara, Koratala Shiva, Janhvi Kapoor, Jr Ntr, Jr Ntr Dance, Jrntr, Tolly

వారు సినిమాని గౌరవిస్తారు.హుందాగా ప్రవర్తిస్తారు.ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నా.ఆయన ఎనర్జిటిక్ హీరో.సెట్ లోకి రాగానే కళ వస్తుంది.ఎన్టీఆర్ సెట్ లో ఉంటే అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు.

ఇటీవల మా ఇద్దరిపై ఓ సాంగ్ షూట్ చేశారు.ఆయన డ్యాన్స్ స్పీడ్ చూసి ఆశ్చర్యపోయాను.

దేన్నైనా ఒక్క సెకన్ లోనే నేర్చుకోగలరు.అదే విషయాన్ని నేర్చుకోవడానికి నాకు పది రోజులు పడుతుంది.

నెక్స్ట్ సాంగ్ కోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను.ఇక డైరెక్టర్ కొరటాల శివ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కూల్ గా ఉంటారు.

ఆయనతో కలిసి పని చేయడం సులభం అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube