బాబాయ్ కి కోపం వస్తే అలా పిలుస్తారు...ఆ గిఫ్ట్ అలానే ఉంది: నిహారిక

మెగా డాటర్ నిహారిక ( Niharika )!ప్రస్తుతం తన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్ళు ( Commiti Kurrallu ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు నిహారిక నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలో ఉన్నాయి.ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి.

 Niharika Says Interesting Comments About Pawan Kalyan ,pawan Kalyan,niharika, Ak-TeluguStop.com

ఇక ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిహారిక సైతం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

Telugu Akhira, Ap, Niharika, Niharikapawan, Pawan Kalyan-Movie

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉండగా తనకు సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ఎక్కువ ప్రశ్నలు ఎదురవడం గమనార్హం.ఈ విధంగా నిహారికకు పవన్ కళ్యాణ్ గురించి అధిక ప్రశ్నలు ఎదురవుతున్నాయి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీ గెలిచిన అనంతరం ఇంట్లో వారు ఎలా ఫీలయ్యారు అనే ప్రశ్న ఎదురయింది.

Telugu Akhira, Ap, Niharika, Niharikapawan, Pawan Kalyan-Movie

ఎలక్షన్ కౌంటింగ్ రోజు మేమంతా చాలా ఎక్సైట్ గా చూస్తూనే ఉన్నాం కానీ బాబాయ్ భారీ మెజార్టీతో గెలిచారు అనే విషయం తెలియగానే అమ్మ చాలా ఎమోషనల్ అయిందని తెలిపారు.అదేవిధంగా కళ్యాణ్ బాబాయ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు బాబాయ్ కి ఎక్కువ సంతోషం వచ్చిన కోపం వచ్చినా నన్ను ఎప్పుడు కూడా నీహ అని పిలుస్తారు ఆయన నాపై కోప్పడిన సందర్భాలు లేవని తెలిపారు.ఇక ఒకసారి రాఖీ పండుగ సందర్భంగా అకీరాకు ( Akhira ) రాఖి కట్టినందుకు బాబాయ్ నాకు ఒక మొక్కను గిఫ్ట్ గా ఇచ్చారు ఇప్పటికీ ఆ మొక్క చాలా భద్రంగా ఆరోగ్యంగా పెరుగుతోంది అంటూ నిహారిక పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube