బాబాయ్ కి కోపం వస్తే అలా పిలుస్తారు…ఆ గిఫ్ట్ అలానే ఉంది: నిహారిక

మెగా డాటర్ నిహారిక ( Niharika )!ప్రస్తుతం తన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్ళు ( Commiti Kurrallu ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు నిహారిక నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలో ఉన్నాయి.

ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి.

ఇక ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిహారిక సైతం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

"""/" / ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉండగా తనకు సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ఎక్కువ ప్రశ్నలు ఎదురవడం గమనార్హం.

ఈ విధంగా నిహారికకు పవన్ కళ్యాణ్ గురించి అధిక ప్రశ్నలు ఎదురవుతున్నాయి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీ గెలిచిన అనంతరం ఇంట్లో వారు ఎలా ఫీలయ్యారు అనే ప్రశ్న ఎదురయింది.

"""/" / ఎలక్షన్ కౌంటింగ్ రోజు మేమంతా చాలా ఎక్సైట్ గా చూస్తూనే ఉన్నాం కానీ బాబాయ్ భారీ మెజార్టీతో గెలిచారు అనే విషయం తెలియగానే అమ్మ చాలా ఎమోషనల్ అయిందని తెలిపారు.

అదేవిధంగా కళ్యాణ్ బాబాయ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు బాబాయ్ కి ఎక్కువ సంతోషం వచ్చిన కోపం వచ్చినా నన్ను ఎప్పుడు కూడా నీహ అని పిలుస్తారు ఆయన నాపై కోప్పడిన సందర్భాలు లేవని తెలిపారు.

ఇక ఒకసారి రాఖీ పండుగ సందర్భంగా అకీరాకు ( Akhira ) రాఖి కట్టినందుకు బాబాయ్ నాకు ఒక మొక్కను గిఫ్ట్ గా ఇచ్చారు ఇప్పటికీ ఆ మొక్క చాలా భద్రంగా ఆరోగ్యంగా పెరుగుతోంది అంటూ నిహారిక పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రజనీతో పోటీ అంటే సూర్య భయపడ్డారా.. వెనుకడుగు వేయడం వెనుక కారణాలివేనా?