అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ మూడు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు దర్శకులు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ).దర్శకుడిగా ఈయన మొట్టమొదట అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఇదే సినిమానే హిందీలో కబీర్ సింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు.ఇక ఇటీవల రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు.ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి త్వరలోనే ప్రభాస్( Prabhas ) హీరోగా స్పిరిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన కుమారుడికి ఒక సూపర్ హిట్ సినిమా పేరును పెట్టినట్లు సందీప్ రెడ్డి వెల్లడించారు.ఈయన అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో తన కొడుకు పుట్టడంతో తన కొడుకుకి కూడా అర్జున్ రెడ్డి అనే పేరును పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
తన కొడుకుకి ఇదే పేరు పెట్టడం నా సినిమాకు ఈ పేరు పెట్టడంతో సినిమా కూడా చాలా మంచి సక్సెస్ అయిందని తెలిపారు.అర్జున్ రెడ్డి అనే పేరులో ఏదో తెలియని షార్ప్ నెస్ ఉంటుందని ఈ సందర్భంగా సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







