ఇప్పటి హీరోయిన్స్ లలో సాయి పల్లవి కి మాత్రమే ఈ ఘనత దక్కింది

అవార్డులు చాలామంది అందుకుంటారు కానీ అందుకు తగ్గ అర్హత ఎంత మందికి ఉంటుంది చెప్పండి.ఈ మధ్యకాలంలో ఒక అవార్డు వస్తుంది అంటే దానికి ఏదో ఒక లోపాయికారి ఒప్పందం జరిగింది అనేక వారే ఎక్కువ అయిపోయారు.

 How Sai Pallavi Received Fim Fare Awards , Sai Pallavi , Fim Fare Awards , Filmf-TeluguStop.com

ఆస్కార్ అవార్డు నుంచి ఈ నంది అవార్డు వరకు ఇదే పోకడ కనిపిస్తుంది.రానున్న రోజుల్లో అవార్డు అని ఒక గొప్ప తరానికి అర్థం లేకుండా పోతుందేమో అని బాధపడేవారు లేకపోలేరు.

కానీ సాయి పల్లవి లాంటి ఒక హీరోయిన్ ( heroine )ని చూసిన ప్రతిసారి ఈమె అవార్డుల కోసమే మరియు నటించడం కోసమే పుట్టిందా అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది.ఎక్కడ ఈ ఎంతటి క్లిష్టమైన పరిస్థితులలో అయినా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు.

Telugu Filmfare Award, Fim Awards, Gargi, Saipallavi, Love Story, Virataparvam,

ఇక సాయి పల్లవి( Sai Pallavi ) తాజాగా విరాటపర్వం సినిమా కోసం ఫిలింఫేర్ అవార్డు ( Filmfare Award )అందుకుంది ఇది అందరికీ తెలిసిన విషయమే.అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆమె తన కెరీర్ లో ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుంది.అందులో నటించిన వరుస నాలుగు చిత్రాలకు నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం.ఇలాంటి ఒక ఘనత సాధించాలంటే కచ్చితంగా ఇప్పటి తరం హీరోయిన్ లో సాయి పల్లవి మినహా మరెవ్వరికి సాధ్యం కాదు.

ఆమె తాజాగా విరాటపర్వం సినిమాకి ( Virataparvam )అవార్డు అందుకున్న తర్వాత ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు అందుకున్న అవార్డుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Telugu Filmfare Award, Fim Awards, Gargi, Saipallavi, Love Story, Virataparvam,

ఆమె నటించిన వరుస సినిమాలు అయిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, గార్గి మరియు విరాటపర్వం చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి.అంతకన్నా ముందు ప్రేమమ్ సినిమాకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ అవార్డు అందుకుంది.అలాగే గారికి చిత్రానికి బెస్ట్ యాక్టర్స్ అవార్డు అందుకోగా విరాటపర్వం సినిమాకి బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు అందుకుంది.

లవ్ స్టోరీ మరియు శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు కూడా ఇదే కేటగిరిలో ఆమె అవార్డు అందుకోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube