ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ( Anant Ambani ) రాధిక మర్చంట్( Radhika Marchant ) వివాహపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు.
అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన( Upasana ) ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఎంతో అందంగా కనిపించారు.
ఇలా ఉపాసన చీరలో( Upasana Saree ) ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఉపాసన కట్టిన ఈ చీర వెనక చాలా పెద్ద స్టోరీ ఉందని తెలుస్తోంది.ఉపాసన కట్టిన ఈ చీర తన అమ్మది కావటం విశేషం.ఇలా తన అమ్మచీరను ఈమె అంబానీ పెళ్లి వేడుకలలో కట్టి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇక ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
నిజానికి ఉపాసన ఎక్కువగా షాపింగ్ కోసం ఖర్చు చేయరు ఆమె ఇలా తన అమ్మ, అమ్మమ్మ చీరలను తిరిగి రీ డిజైన్ చేయిస్తూ వాటిని ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేత తన అమ్మమ్మ చీరకు మరింత మెరుగులు దిద్దించి ఈమె చాలా స్టైలిష్ గా తయారు చేయించుకొని ఈ పెళ్లి వేడుకలలో ధరించారని తెలుస్తోంది.ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఉపాసన రాంచరణ్ దంపతులు రెండు రోజులపాటు ఈ పెళ్లి వేడుకలలో సందడి చేసిన సంగతి తెలిసిందే.వీరితోపాటు వెంకటేష్ దంపతులు, మహేష్ బాబు దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.