అంబానీ పెళ్లి వేడుక..160 యేళ్ళ వయస్సు చీర కట్టిన అలియా ... చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అంబానీ పెళ్లి( Ambani Wedding ) వేడుకలలో భాగంగా సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన స్టార్స్ అందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక బాలీవుడ్ సెలబ్రిటీ లందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

 Alia Bhatt Wore 160 Years Old Saree In Ambani Wedding Function Details,alia Bhat-TeluguStop.com

ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia Bhatt ) కి పెళ్లి వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఈమె ఎక్కడికి వెళ్ళిన ఇటీవల కాలంలో చాలా సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకొని కనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో కూడా అలియా భట్ రాణి కలర్ శారీలో మెరిసిపోయారు.

ఇక ఈ పెళ్లికి వచ్చిన వారందరి దృష్టి కూడా ఈమె పైనే పడింది.దీంతో ఈ చీర గురించి ఆరా తీయడం మొదలు పెట్టగా ఈ చీర గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈమె కట్టిన ఈ చీర వయసు 160 సంవత్సరాలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ చీర గుజరాత్( Gujarat ) లో నేసిన  ఆశావలీ చీరట.వందల సంవత్సరాల క్రితం తయారు చేసిన చీరలను కలెక్ట్ చేసే పనిలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర( Manish Malhotra ) ఉన్నారు.

ఇక ఈయన కలెక్ట్ చేసిన చీరలలో ఇది ఒకటి అయితే ఈ చీర అప్పట్లోనే 99% వెండి ఆరు గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో నేసిన చీర.

ఆశావలీ బ్రోకెడ్ 16వ శతాబ్దానికి చెందినవి.ఇక ఈ చీర ఖరీదు అక్షరాల రెండు కోట్ల రూపాయల విలువ చేసిందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.ఇలా ఈమె కట్టిన ఈ చీరకు 160 సంవత్సరాలు అనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇక చీర బంగారం వెండి కలగలిపి నేసిన జరీ అంచుతో చూపరులను కట్టిపడేస్తుంది.ప్రస్తుతం ఆలియా కట్టిన ఈ చీరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube