అంబానీ పెళ్లి వేడుక..160 యేళ్ళ వయస్సు చీర కట్టిన అలియా … చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అంబానీ పెళ్లి( Ambani Wedding ) వేడుకలలో భాగంగా సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన స్టార్స్ అందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక బాలీవుడ్ సెలబ్రిటీ లందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia Bhatt ) కి పెళ్లి వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఈమె ఎక్కడికి వెళ్ళిన ఇటీవల కాలంలో చాలా సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకొని కనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో కూడా అలియా భట్ రాణి కలర్ శారీలో మెరిసిపోయారు.

"""/" / ఇక ఈ పెళ్లికి వచ్చిన వారందరి దృష్టి కూడా ఈమె పైనే పడింది.

దీంతో ఈ చీర గురించి ఆరా తీయడం మొదలు పెట్టగా ఈ చీర గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈమె కట్టిన ఈ చీర వయసు 160 సంవత్సరాలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ చీర గుజరాత్( Gujarat ) లో నేసిన  ఆశావలీ చీరట.వందల సంవత్సరాల క్రితం తయారు చేసిన చీరలను కలెక్ట్ చేసే పనిలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర( Manish Malhotra ) ఉన్నారు.

ఇక ఈయన కలెక్ట్ చేసిన చీరలలో ఇది ఒకటి అయితే ఈ చీర అప్పట్లోనే 99% వెండి ఆరు గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో నేసిన చీర.

"""/" / ఆశావలీ బ్రోకెడ్ 16వ శతాబ్దానికి చెందినవి.ఇక ఈ చీర ఖరీదు అక్షరాల రెండు కోట్ల రూపాయల విలువ చేసిందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా ఈమె కట్టిన ఈ చీరకు 160 సంవత్సరాలు అనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇక చీర బంగారం వెండి కలగలిపి నేసిన జరీ అంచుతో చూపరులను కట్టిపడేస్తుంది.

ప్రస్తుతం ఆలియా కట్టిన ఈ చీరకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాంటి కామెంట్లు చేయడం రైటేనా నాగ్ అశ్విన్.. ఎవరి టాలెంట్ వారిదని గుర్తించాలంటూ?