అసలు ఎందుకు ఓడారు ? త్రిసభ్య కమిటీ విచారణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) గెలిచినా.ఇటీవల జరిగిన ఎంపి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అభ్యర్థులు విజయం దక్కించుకోకపోవడం పై కాంగ్రెస్ ఇప్పుడు  చెందుతోంది.

 Why Was The Three-member Committee Investigating, Bjp, Brs, Congress, Telangana-TeluguStop.com

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎందుకు ఎంపీ స్థానాలు తక్కువగా వచ్చాయి అనే విషయం పైన కాంగ్రెస్  అధిష్టానం దృష్టి పెట్టింది.ఈ మేరకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులతో వేరువేరుగా భేటీ అవుతుంది.ఒక్కో అభ్యర్థితో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమై వారి ఓటమికి గల కారణాలు ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

  దీనిలో భాగంగానే ఈరోజు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన దానం నాగేందర్ ( Danam Nagender )ముందుగా కమిటీ ముందు హాజరయ్యారు.  ఆ తరువాత హైదరాబాద్ , మల్కాజిగిరి,  చేవెళ్ల,  మహబూబ్ నగర్,  మెదక్ పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అవుతున్నారు.

Telugu Congress, Danam Nagendar, Mp, Telangana, Committee-Politics

ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు మిగిలిన వారితో సమావేశమై ఓటమికి గల కారణాలు ఏమిటి ?  నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది , పార్టీ నాయకుల నుంచి తగిన సహకారం అందిందా లేదా ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నారు.లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను,  14 స్థానాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.అదిలాబాద్ ఆత్రం సుగుణ,  కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు,  నిజామాబాద్ లో జీవన్ రెడ్డి( Velichala Rajender Rao, Jeevan Reddy in Nizamabad ) , మెదక్ లో నీలం మధు,  మల్కాజిగిరి లో పట్నం సునీత మహేందర్ రెడ్డి,  సికింద్రాబాద్ లో దానం నాగేందర్ , చేవెళ్ల లో గడ్డం రంజిత్ రెడ్డి , మహబూబ్ నగర్ లో చల్ల వంశీ చంద్ రెడ్డి,  హైదరాబాద్ లో మహమ్మద్ సమీర్ ఓటమి చెందారు .

Telugu Congress, Danam Nagendar, Mp, Telangana, Committee-Politics

వీరు తప్పకుండా గెలుస్తారు అనుకున్న ఓటమి చెందడం పై  కాంగ్రెస్ అధిష్టానం షాక్ కు గురయింది.ఈ నేపథ్యంలోనే ఓటమికి దారితీసిన పరిస్థితుల గురించి నేరుగా పోటీ చేసిన అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది.ప్రస్తుతం దీనిపైనే ఓటమి చెందిన అభ్యర్థుల తో త్రిషభ్య కమిటీ సభ్యులు వివిధ అంశాలపై ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube