ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అపరకుబేరుడు అయిన ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) ఇంట జరిగే పెళ్లి సందడి గురించే మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు.ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ,( Anant Ambani ) రాధిక మర్చంట్ల( Radhika Marchant ) పెళ్లి రేపు అనగా జూలై 12న గ్రాండ్గా జరగనున్న విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి.ఇప్పటికే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు అలాగే బిజినెస్ మాన్ లో పెళ్ళికి హాజరయ్యారు.
పెళ్లికి వచ్చే అతిధుల కోసం కూడా ముఖేష్ అంబానీ తనకు రేంజ్ తగ్గట్టుగానే అతిధి మర్యాదలు చేశారు.
అయితే ఇప్పటివరకూ ఏ ఇతర ధనికుడూ చేయలేని శైలిలో అత్యంత విలాసవంతంగా ఈ పెళ్లి సాగుతోంది.
ఇప్పటికి రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి.ఇప్పుడు అసలైన పెళ్లి ముంబైలో( Mumbai ) జరుగుతోంది.
ఒకసారి అంబానీల స్వస్థలం జామ్ నగర్ గుజరాత్ లో సొంత వారి కోసం ఏర్పాటు చేసిన విందు మరోసారి ప్రపంచ కుభేరులందరినీ ఒక చోటికి చేర్చేందుకు సాగించిన క్రూయిజ్ విందు ఇప్పుడు ముంబై లో అసలు సిసలు పెళ్లి విందుకు సమయమాసన్నమైంది.మూడుసార్లు పెళ్లిళ్ల కోసం అంబానీ కుటుంబం( Ambani Family ) 1500 కోట్లు మించి ఖర్చు చేసిందని కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ స్టార్లు సహా అన్ని సినీపరిశ్రమల నుంచి ప్రముఖులను ముఖేష్ అంబానీ కుటుంబం ఆహ్వానిస్తోంది.

ఇతర రంగాలకు సంబంధించిన జాబితా పెద్దదే ఉంది.రిపీటెడ్ గా గెస్టులను ఆహ్వానించడం ఇక్కడ కొసమెరుపు.అందరికీ సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు పంపుతూనే ఉన్నారు.
అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం అందినా తిరస్కరించిన ఒక ప్రముఖ డైరెక్టర్ కుమార్తె గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.చాలా మంది బాలీవుడ్ స్టార్లు అంబానీల వేడుకలలో కెమెరాల ముందు హొయలు పోయేందుకు తహతహలాడుతుండగా, ఒక అమ్మాయి ఈవెంట్ నుండి దూరంగా ఉండాలని భావించింది.

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్( Anurag Kashyap ) కుమార్తె ఆలియా కశ్యప్( Aaliyah Kashyap ) అంబానీల ఆహ్వానాన్ని తిరస్కరించింది.ఈ పెళ్లికి తాను హాజరు కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొంది.ఆత్మగౌరవం కోసం తాను ఇలా చేసినట్టు బహిరంగంగా వెల్లడించింది.ఈ విషయం గురించి ఆమె స్పందిస్తూ.నిజానికి అనంత్ అంబానీ పెళ్లి పెళ్లి కాదు ఒక సర్కస్ లాగా మారింది.నన్ను కొన్ని ఈవెంట్‌లకు ఆహ్వానించారు.
ఎందుకంటే వారు PR చేస్తున్నారు.కానీ నేను వద్దు అని చెప్పాను.
ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఆత్మగౌరవం ఉందని నేను నమ్ముతున్నాను.ఒకరి పెళ్లికి నన్ను అమ్ముకోవడం కంటే గౌరవం ముఖ్యం అని నేను నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది ఆలియా.