పర్వతాల నుంచి జారే జలపాతాలు చూడటం చాలా ఆహారకరంగా ఉంటుంది.వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి, జలపాతాల ధ్వని వినడానికి, వాటి చుట్టూ ఏర్పడే నీటి తుంపర్లను చూడటానికి చాలా మంది ఇష్టపడతారు.
అయితే ఇటీవల ఓ ఎడారి మధ్యలో ఒక ప్రత్యేకమైన జలపాతం అందరి దృష్టిని ఆకర్షించింది ఎడారిలో జలపాతం ఏంటని ఆశ్చర్యపోతున్నాను కాదు? నిజానికి ఇది జలపాతం కాదు ఇసుకపాతం.ఇటీవల దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయింది, అందులో ఒక అద్భుతమైన “ఇసుక జలపాతం” కనిపిస్తుంది.
ఈ అరుదైన దృశ్యం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.కొంతమంది దీనిని “ఇసుక పతనం” అని పిలవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు, ఎందుకంటే దీనిలో నీరు లేదు.
వీడియోలో ఒక వ్యక్తి ఎడారి( Desert )లో పెద్ద సింక్ హోల్ వైపు చూపించడం మనం చూడవచ్చు.ఇసుక నీటిలా కొండపై నుంచి ప్రవహిస్తూ, “ఇసుకపాతం” సృష్టిస్తోంది.ప్రజలు స్నానం చేసే జలపాతాల మాదిరిగా కాకుండా, ఇది ప్రమాదకరమైనది, మనుషుల్ని సజీవంగా పాతిపెట్టగలదు.“ఎడారి అద్భుతం! కొండపై నుంచి నీరులా ఇసుక ప్రవహించే అద్భుతమైన ‘ఇసుక జలపాతం( Sand fall ) చూడండి.ప్రకృతి అద్భుతమైనది!” అని దీనికి ఓ క్యాప్షన్ జోడించారు.ఇసుక జలపాతం అంటే ఒక వాలుగా ఉన్న ప్రదేశంలో ఇసుక క్రిందికి పడటం వల్ల ఏర్పడే ఒక ప్రత్యేక దృశ్యం.
దూరం నుండి చూస్తే ఇది ఒక నిజమైన జలపాతంలా కనిపిస్తుంది.ఈ దృశ్యం ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తుంది, అక్కడ గాలి, గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇసుక కదిలి, వాలుగా ఉన్న కొండలు లేదా ఇసుక దిబ్బలపై నుంచి క్రిందికి పడుతుంది.
ఈ దృశ్యాన్ని ఆఫ్రికాలోని నమీబియా ఎడారి, అరేబియా ఎడారి, అమెరికా దక్షిణ పశ్చిమ ప్రాంతాలలో చాలా సార్లు గమనించవచ్చు.ఇది చాలా అందంగా కనిపించినప్పటికీ, ఎడారి ప్రాంతాలలో ఎప్పటికప్పుడు మారుతున్న భూమి స్వరూపాన్ని కూడా ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది.ఇసుక జలపాతం వీడియో ఇన్స్టాగ్రామ్లో 2 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.వీడియో చూసిన వారు తమ ఆశ్చర్యాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు.”స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు నేను నీటి కింద ఇసుక జలపాతాన్ని చూశాను.ఇది చాలా అద్భుతంగా ఉంది.” అని ఒక యూజర్ పేర్కొన్నారు.“ఇసుక జలపాతం అంటే ఇసుక, నీరు కలిసి క్రిందికి పడటమా?” అని మరో యూజర్ ఆసక్తిని వ్యక్తం చేశారు.