మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె( heart ) దే మొదటి స్థానం.ఒక్క సెకండ్ గుండె ఆగిందంటే మనిషి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
అలాగే ప్రతి ఏడాది గుండె జబ్బులు కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు.అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ధూమపానం, శరీరానికి శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తదితర అంశాలు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
గుండె జబ్బులకు కారణం అవుతాయి.కాబట్టి గుండె జబ్బులకు దూరంగా ఉండాలి అంటే కొన్ని అలవాట్లను తప్పకుండా చేసుకోవాలి.
ముఖ్యంగా ఆరోగ్యమైనవి తినండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయండి.ధూమపానం( smoking ) పూర్తిగా మానేయండి.కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును నియంత్రణలో ఉంచుకోండి.నిత్యం వ్యాయామం చేయండి.
ఇకపోతే గుండెను ఆరోగ్యంగా దృఢంగా ఉంచడంలో కొన్ని పండ్లు చాలా బాగా సహాయపడతాయి.ఈ జాబితాలో అవకాడో ఒకటి.
గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పొటాషియం అవకాడోలో( avocado ) మెండుగా ఉంటుంది.ఈ పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
అలాగే దానిమ్మ పండ్లలో( pomegranate fruits ) విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.ఇవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.అదే సమయంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోకుండా దానిమ్మ గింజలు అడ్డుకట్ట వేస్తాయి.గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని భావించేవారు స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీ పండ్లను తీసుకోండి.ఇవి గుండెకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కరిగిస్తాయి.
గుండెకు అండగా నిలబడతాయి.ఇక ఆరెంజ్, పుచ్చకాయ, అరటిపండు, బొప్పాయి వంటి పండ్లు కూడా గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.