వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల( Volunteers ) విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తుంది.ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు.

 Petition In High Court To Remove Volunteers Details, Ap High Court, Volunteer S-TeluguStop.com

దీంతో వాలంటీర్ లు తమ ఉద్యోగం విషయంలో అభద్రత భావంతో ఉన్నారు.పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో( High Court ) పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.

వారి నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని.వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది.2019లో వైసీపీ( YCP ) ప్రభుత్వం ఏర్పడిచిన సమయంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది.ఈ వ్యవస్థ ద్వారానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు అందించేలా వ్యవహరించారు.కరోనా సమయములో ఇంకా అనేక సందర్భాలలో వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.

పెన్షన్ ప్రతి ఉదయమే అందిస్తూ వాలంటీర్లు తమ విధులను నిర్వర్తించడం జరిగింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా.? లేదా.? అన్నది సందేహంగా మారింది.ఇటువంటి పరిస్థితులలో పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత కూటమి ప్రభుత్వం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరింత సంచలనంగా మారింది.సరిగ్గా ఈ సమయంలో వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube