కల్కి 2898 ఏడీ మూవీ( Kalki 2898AD ) రిజల్ట్ మరో 9 గంటల్లో తేలిపోనుంది.తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం తర్వాత ఉదయం 4 గంటల నుంచి స్టార్ హీరో సినిమా ప్రదర్శించనుండటం గమనార్హం.
అయితే కల్కి 2898 ఏడీ సినిమాలో కృష్ణుడి రోల్ లో( Lord Krishna Role ) సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) కనిపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో కృష్ణుడి రోల్ లో సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.పాత సినిమాల ఫుటేజ్ ద్వారా ఎన్టీఆర్ ను చూపిస్తారని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ సినిమా ఇతర భాషల రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం జరుగుతుంది.కల్కి 2898 ఏడీ సినిమా ప్రభాస్( Prabhas ) రేంజ్ ను ఏ రేంజ్ లో పెంచబోతుందో కూడా ఈ సినిమాతో క్లారిటీ రానుంది.
కల్కి 2898 ఏడీ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా మూడేళ్ల పాటు కష్టపడ్డారని సమాచారం అందుతోంది.కల్కి 2898 ఏడీ సినిమా టాక్ త్వరగానే తెలిసిపోనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టైర్2, టైర్3 సిటీలలో సైతం తెల్లవారుజాము నుంచి ఈ సినిమా షోలు ప్రదర్శితం కానున్నాయి.ఉదయం 4 గంటల నుంచి కల్కి మూవీ హవా మొదలుకానుంది.టికెట్ రేట్ల విషయంలో సైతం కల్కి అదరగొడుతోంది.కల్కి మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్( Nag Ashwin ) తొలి భాగంతోనే అంచనాలను మించి మెప్పించాల్సి ఉంది.
కల్కి మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ సైతం జరుగుతోంది.700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఆ రేంజ్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది.నాగ్ అశ్విన్ ను ఈ సినిమా ఎన్ని మెట్లు పైకి ఎక్కిస్తుందనే ప్రశ్నలకు జవాబులు దొరాకాల్సి ఉంది.కల్కి సినిమాకు సంబంధించి బడ్జెట్, పబ్లిసిటీ విషయంలో మేకర్స్ మాత్రం అస్సలు రాజీ పడలేదు.