ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క.
పాలనపరంగా ప్రక్షాళన చేస్తూ ఉంది.దీనిలో భాగంగా ఇప్పటికే పెన్షన్ దారులకు 4వేల రూపాయలు పెంచడం జరిగింది.
పెంచిన పెన్షన్ డబ్బులు జూలై మొదటి తారీకు నుండి వాలంటీర్ల ( AP Volunteers )ద్వారా పంపిణీ చేయబోతున్నారు.అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణాలలో కందిపప్పు పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
కాగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.విషయంలోకి వెళ్తే ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ కళాశాలలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్ళు, ఏపీ గురుకుల పాఠశాలలు, హై స్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయబోతున్నారు.సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ను ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
టెక్ట్స్ బుక్స్ తో పాటు నోట్ బుక్ లు, బ్యాగ్ లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు.