తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా సెట్ చేసిన అల్లు అర్జున్...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun ).ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

 Allu Arjun Set A Film With Tamil Star Director ,allu Arjun , Shankar, Game Chang-TeluguStop.com

అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నమంటూ అఫీషియల్ గా సినిమా యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.అయితే ఈ సినిమా దాదాపు నాలుగు నెలల పాటు పోస్ట్ పోన్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు.ఇక అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ కూడా ఒక అండర్ స్టాండింగ్ మీదనే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది.

 Allu Arjun Set A Film With Tamil Star Director ,Allu Arjun , Shankar, Game Chang-TeluguStop.com

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ అయితే క్యాన్సల్ అయింది.మరి ఇప్పుడు అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మరో తమిళ్ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ తో గేమ్ చేంజర్( Game changer ) సినిమా చేస్తున్న శంకర్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో ఎప్పటినుంచో అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.కానీ అది వీలుపడలేదు.ఇక ఇప్పుడు అవకాశం రావడంతో శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే శంకర్ అల్లు అర్జున్ ని కలిసి ఆయనకొక లైన్ వినిపించారట.అది బాగా నచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమాని మనం చేద్దామని చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube