ప్రతిష్టాత్మక అమెరికన్ యూనివర్సిటీలలో చదువుకోవాలని, ఆ యూనివర్సిటీలలోని తరగతి గదిలో కూర్చుని ప్రొఫెసర్లు చెప్పే పాటలను వినాలని చాలామందికి ఆశ ఉంటుంది.కానీ దానిని నెరవేర్చుకోవాలంటే చాలా కష్టం ముందుగా బాగా చదువుకోవాలి అలాగే డబ్బులు కూడా ఉండాలి.
అయితే ఆ డ్రీమ్ నిజం చేసుకోవాలంటే డబ్బు, ఎక్స్‌లెంట్ గ్రేడ్స్ అవసరం లేదని క్లాస్‌ప్లస్( Classplus ) సహ వ్యవస్థాపకుడు ముకుల్ రుస్తగి నిరూపించారు.
ముకుల్( Mukul Rustagi ) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన కథను పంచుకున్నారు.ముకుల్, అతని బిజినెస్ పార్ట్‌నర్ భాస్వత్ అగర్వాల్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్నప్పటినుంచి అనుకునేవారు.కానీ అధిక ఖర్చులు, తక్కువ మార్కుల కారణంగా అది సాధ్యం కాలేదు.
అయినా, వారి కలను వదులుకోకుండా, వారు ఒక రోజు స్టాన్‌ఫర్డ్ క్యాంపస్‌కి వెళ్లి, ఒక తరగతి గదిలోకి అక్రమంగా ప్రవేశించారు.
ముకుల్, భాస్వత్ క్యాంపస్‌లో తిరుగుతూ, ఒక ఫైనాన్స్ క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చారు.లోపల ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తితో వారు ధైర్యంగా ముందుకు వెళ్లారు.లోపల కూర్చోడానికి అనుమతిస్తారా? అని ప్రొఫెసర్‌ను అడిగారు.ఆ ప్రొఫెసర్ అంగీకరించారు.అలా వారు ఉచితంగానే ఆ యూనివర్సిటీలో ఫ్రీ క్లాస్ కి హాజరయ్యారు.దీని గురించి వివరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.298,000కు పైగా వ్యూస్, 15,000కు పైగా లైక్‌లతో, ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుందియూనివర్సిటీలోకి ప్రవేశించిన వారి ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు.యూఎస్ యూనివర్శిటీలలో అధికారికంగా నమోదు చేయకుండా తరగతులకు హాజరవడం సాధారణమేనని కొందరు గుర్తు చేశారు.జర్మనీ( Germany)లో తమకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయని మరికొందరు పంచుకున్నారు.అయితే అమెరికాకి వెళ్లడానికి డబ్బులు కావాలి కదా అని మరి కొంతమంది ప్రశ్నించారు.ఒకవేళ ప్రొఫెసర్ రావద్దు అని చెబితే శ్రమ డబ్బులు అంతా వేస్ట్ అవుతాయి కదా అని మరి కొంతమంది ప్రశ్నించారు.