రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ( Telangana Formation Day ) వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ ( District Additional Collector N Khemya Naik )క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కార్యాలయ సిబ్బంది అందరూ వేడుకలకు హాజరు కావాలని అన్నారు.వేడుకలు సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరిశీలనలో అదనపు కలెక్టర్ వెంట పరిపాలన అధికారి రాంరెడ్డి, పర్యవేక్షకులు వేణు, తదితరులు ఉన్నారు.