మొటిమలకు చెక్ పెట్టి ముఖాన్ని మృదువుగా మార్చే బెస్ట్ హోమ్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ అత్యంత సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ( Acne ) ముందు వరుసలో ఉంటాయి.ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే మొటిమల కారణంగా మనలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

 This Is The Best Home Remedy To Check Acne And Make The Face Soft! Soft Skin, Sh-TeluguStop.com

మొటిమలు అందాన్ని చెడగొడతాయి.ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

ఈ క్రమంలోనే మొటిమలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ది బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.

Telugu Acne, Acne Skin, Tips, Remedy, Latest, Pimples, Shiny Skin, Skin Care, Sk

ఈ రెమెడీ మొటిమలకు చెక్‌ పెట్టడమే కాదు ముఖాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా సైతం మెరిపిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ ( Oats Powder )ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ), వన్ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Remedy, Latest, Pimples, Shiny Skin, Skin Care, Sk

చివ‌ర‌గా రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ మరియు సరిపడా నార్మల్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని వారానికి రెండు సార్లు పాటిస్తే మొటిమల బెడద క్రమంగా తగ్గుతుంది.చర్మం పై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.ఓట్స్, గ్రీన్ టీ, కోకోనట్ పౌడర్ చర్మానికి చక్కని పోషణ అందిస్తాయి.

ముడతలు, చర్మం సాగటం, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని యవ్వనం గా మారుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube