సోషల్ మీడియా( Social media ) వినియోగం పెరిగిన కొద్దీ ప్రపంచంలో నలుమూలల ఏ విషయం జరిగిన అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రపంచం మొత్తం ఇట్లే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే ప్రతిరోజు అనేక వీడియోలు, పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనిస్తూనే ఉంటాం.
ఈ వైరల్ గా మారిన వీడియోలో అనేక రకాల వీడియోలు ప్రజలకు ఆనందాన్ని కలిగించేలా ఉంటాయి.మరికొన్ని అయితే కాస్త వెరైటీగా కూడా ఉంటాయి.
ఇకపోతే తాజాగా వెరైటీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోలో.మామూలుగా ఎవరైనా సరే హిందూ సంప్రదాయ ప్రకారం కొత్త ఇల్లు లేదా, ఏదైనా భవనంలో చేరే సమయంలో స్టవ్ మీద కొత్త గిన్నె పెట్టి అందులో పాలు పొంగించడం సహజంగా అందరు చేస్తుంటారు.కాకపోతే ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ అందుకు సంబంధించిన అలవాట్లు కూడా మారిపోతూనే ఉన్నాయి.
అందుకే కాబోలు ఒకరు కాస్త వెరైటీగా ఆలోచించి.పాలు పొంగించేందుకు ఏకంగా నీటిని వేడి చేసేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ కెటిల్( Electric kettle) ను ఉపయోగించి పాలు పొంగించేశాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కెరలు కొడుతుంది.ఈ వీడియో కూడా హైదరాబాదు నగరానికి సంబంధించినదిగా అర్థమవుతుంది.
ఇక మామూలుగానే వైరల్ గా మారిన వీడియోలకి సోషల్ మీడియా నెటిజన్స్ కాస్త భిన్నంగా కామెంట్ చేస్తున్నారు.కొందరైతే మన సాంప్రదాయాన్ని కాస్త పెడదోవ పట్టిస్తున్నారు అంటూ ఘాటుగా స్పందిస్తే.మరికొందరైతే అసలు మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ ఫన్నీగా కూడా కామెంట్ చేస్తున్నారు.