ఎక్కడైనా సరే విద్యార్థులు వారి ప్రతిభను నిరూపించుకోవడానికి ఉపాధ్యాయులు నిర్వహించే పరీక్షలలో అధిక మార్కులు తెచ్చుకుంటారు.ఇకపోతే పరీక్షల్లో ఎక్కడైనా వందకి వంద మార్కులు తెచ్చుకోవడం సామాన్యమే.
అదే వందకు పైగా తెచ్చుకుంటే.ఏంటి 100 కు 100 కాకుండా ఇంకా ఎక్కువ మార్కులు వేస్తారని ఆలోచిస్తున్నారా.
అవునండి తాజాగా గుజరాత్ రాష్ట్రంలో( Gujarat ) ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ఈ విషయం సంబంధించి పూర్తిగా వివరాలు చూస్తే.
గుజరాత్ రాష్ట్రంలోని దాహుద్ జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల సంబంధించి పరీక్షా ఫలితాలలో దారుణమైన తప్పిదం వల్ల వివరానికి దారితీసింది.ఈ కారణం చేత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ యొక్క సమగ్రత గురించి ఆలోచన పెరిగింది.ప్రభుత్వ పాఠశాలలోని నాలుగో తరగతి చదువుతున్న వన్షి బెన్( Vanshiben ) అనే అమ్మాయికి సంబంధించిన రిజల్ట్ షీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.సదరు అమ్మాయి తన రిజల్ట్ సీట్ ను చూసుకొని ఆ అమ్మాయికి వచ్చిన మార్కులను( Marks ) చూసి ముందుగా సంతోషపడిన, ఆ తర్వాత ఆశ్చర్యపోయింది.
దీనికి కారణం గుజరాతిలో 200 మార్కులకు 211 మార్కులు సాధించగా.అలాగే లెక్కలు సబ్జెక్టులో 212 మార్కులు సాధించడంతో ఆ విషయాన్ని ఇంట్లో తెలిపింది.దాంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో అందుకు సంబంధించిన మార్క్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఫలితాలు మూల్యంకన సమయంలో లోపం సంభవించిన కారణంగా ఇలాంటి పొరపాటు జరిగిందని ఆ తర్వాత అందుకు సంబంధించిన మార్కుషీట్ సవరించబడింది.సవరించిన తర్వాత గుజరాతిలో 200 కి 191, గణితంలో 200 కి 190 మార్కులు సాధించినట్లు తెలిపారు.ఈ పొరపాటు కారణంగా ప్రభుత్వం స్పందిస్తూ.
పొరపాటుకు కారణాన్ని తెలుసుకోవడానికి అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా నిర్వహించడానికి రాష్ట్ర విద్యాధికారులు దర్యాప్తుని ప్రారంభించారు.