అందరిలా పనులు చేయడం., అందరితో కలిసి తిరగడం కాకుండా కొత్తగా ఆలోచించి కొత్త పనులను చేసేవారు చాలా తక్కువ.
ఈ క్రమంలో కొందరు వారి తెలివితేటలకు పదును పెట్టి డబ్బును, అలాగే సమయాన్ని ఆదా చేయడం మనం చూస్తూనే ఉంటాం.అలాంటి వాటిని చూసినప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది.
వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా ఉన్నాయి.తాజాగా ఇలాంటి విచిత్ర పనికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇస్త్రీ చేసేందుకు ఓ వ్యక్తి విద్యుత్ బిల్లుతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసేందుకు విచిత్ర ప్రయోగాన్ని కనిపెట్టాడు.ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో అతడు చేసిన పనిని చూడవచ్చు.
వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి దుస్తులను( Clothes ) చాలా వెరైటీగా క్రియేటివ్ గా ఇస్త్రీ( Ironing ) చేసే విధానం కనబడుతుంది.ఇదివరకు మనం కొన్ని వీడియోలలో వేడి నీటి చెంబుతో ఇస్త్రీ చేస్తుంటే మరికొందరు ఇస్త్రీ బాక్స్ ను పొయ్యి మీద వేడి చేసి తద్వారా ఇస్త్రీని చేయడం లాంటి వీడియోలో చూశాం.ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి మాత్రం తాను ఇంట్లో పప్పు వండుకుంటున్న కుక్కర్ ను( Cooker ) ఉపయోగించి ప్రయోగాన్ని చేశాడు.
వారి వంట గదిలో ఓ దుప్పటి వేసి దానిపై తన చొక్కాను ఉంచుకొని ఉండగా.కుక్కర్ విజిల్ అయిపోగానే దానిని చేతికి తీసుకొని చొక్కాపై ఉంచుతాడు.అలా కుక్కర్ ను షర్టుపై ముందుకు వెనుక కదిలించిన తర్వాత పక్కన పెట్టి మరోసారి షర్టును మరోవైపు తిప్పి మరల అలాగే చేస్తాడు.
దీంతో అతని షర్ట్ ఐరన్ పూర్తవుతుంది.ఈ వైరల్ వీడియో కి సంబంధించి సోషల్ మీడియా నెటిజెన్స్ అతడిపై తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మరికొందరైతే షర్ట్ ఐరన్ ఇలా కూడా చేసుకోవచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు