బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై సంచలన తీర్పు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్( BRS MLC Dande Vithal ) ఎన్నికపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) సంచలన తీర్పును వెలువరించింది.ఈ మేరకు ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం ప్రకటించింది.

 Sensational Verdict On The Election Of Brs Mlc Dande Vithal Details, Mlc Dande V-TeluguStop.com

కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెల్లడించింది.అయితే ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022 లో దండె విఠల్ ఎన్నికైన సంగతి తెలిసిందే.

ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణకు ప్రయత్నించారని రాజేశ్వర్ రెడ్డి( Rajeshwar Reddy ) ఫిర్యాదు చేశారు.అనంతరం విఠల్ ఎన్నికను వాలస్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ క్రమంలో దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది.అదేవిధంగా దండె విఠల్ కు రూ.50 వేల జరిమానా విధించింది.కాగా దండె విఠల్ న్యాయవాది అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టు తీర్పును నాలుగు వారాలు సస్పెండ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube