ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను ధర్మాసనం జులైకి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయలన్న పిటిషన్ పై ఇంకా తెలంగాణ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఫైల్ చేయలేదు.దీంతో రేవంత రెడ్డి,తెలంగాణ ప్రభుత్వంతో (Revanth Reddy , Telangana Govt) పాటు ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
అలాగే రేవంత్ రెడ్డి, తెలంగాణ సర్కార్ కౌంటర్ ఫైల్ చేయని నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేసింది.అయితే ఓటుకు నోటు (Vote for Note,)కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.
విచారణ నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని కేసు విచారణను బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో(Supreme Cour) పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.







