వైరల్ వీడియో: అదిరిపోయిన టి20 ప్రపంచ కప్ అధికార గీతం..

ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ ఎన్నికలు( Lok Sabha elections ) తోపాటు ఐపీఎల్ మహా సంగ్రామం కూడా జరుగుతోంది.ఈ ఐపిఎల్ సీజన్ అయిపోయిన వారం రోజుల్లోనే మరో పెద్ద క్రికెట్ సంబరం జరగబోతోంది.

 Official Song Of T20 World Cup That Went Viral Video, Viral Video, T20 World Cup-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా 20 జట్లు పాల్గొనే ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ దేశాలలో జరగనుంది.ఇకపోతే తాజాగా పురుషుల టి20 ప్రపంచ కప్ 2024 సంగ్రామం సంబంధించి ఐసీసీ ఓ అధికార గీతాన్ని విడుదల చేసింది.

‘అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్’ ( Out of this World )అనే గీతాన్ని గ్రామీ అవార్డు గెలుచుకున్న కళాకారుడు సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ కలిసి రూపొందించారు.సరిగ్గా నెల రోజుల తర్వాత జరగబోయే టోర్నమెంట్ కి సంబంధించి తాజాగా అధికారిక గీతాన్ని వెలవడించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ.

ఈ పాట వినడానికి చాలా ఉత్సాహాన్ని రేకిత్తిస్తుంది.మైఖేల్ టానో మెంటాను చేత ఈ పాటకు సంగీతాన్ని అందించారు.ఈ వీడియోలో మొదటగా క్రికెటర్ల ఫోటోలో చూపిస్తున్న నేపథ్యంలో భారత్ కు చెందిన విరాట్ కోహ్లీ ఫోటోని, ఆ తర్వాత మిగతా జట్లలోని ఆటగాళ్లను ఒక్కొక్కరిగా చూపిస్తారు.

ఈ పాటకు సంబంధించి సోకా సూపర్ స్టార్ కేస్ మాట్లాడుతూ.‘క్రికెట్ ఎల్లప్పుడూ కరేబియన్ సంస్కృతిలో ప్రధాన భాగం.టీ 20 ప్రపంచ కప్( T20 World Cup ) కోసం అధికారిక గీతాన్ని వ్రాసి రికార్డ్ చేయడం నాకు గౌరవంగా ఉంది.

ఈ గీతాన్ని ప్రేరేపించిన సృజనాత్మక సిబ్బంది పట్ల ఎంతో గౌరవం ఉంది.ఈ ట్రాక్ క్రికెట్ శక్తివంతమైన సంస్కృతిని, అలాగే శక్తిని ప్రతిబింబిస్తుంది.ప్రజలు పాడటానికి, ఐక్యత యొక్క స్ఫూర్తిని అనుభవించడానికి నిజమైన గీతం అంటూ పేర్కొన్నాడు.

ఇక గ్రామీ అవార్డు గ్రహీత సీన్ పాల్ ( Sean Paul )మాట్లాడుతూ.క్రికెట్ కార్నివాల్ మొదలయ్యే వరకు నేను వేచి ఉండలేను.వెస్టిండీస్, యూఎస్ఏ దేశాల అంతటా ఉన్న స్టేడియాలకు పార్టీని తీసుకువస్తూ ప్రతి ఒక్కరూ గీతం పాడటం వింటాను అంటూ.

క్రికెట్‌ లాగానే సంగీతానికి కూడా ప్రజలను ఐక్యంగా ఈ వేడుకలో చేర్చే శక్తి ఉందని తాను ఎప్పుడూ నమ్ముతాను అని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube