ఏపీలో రెండో రోజు పెన్షన్‌దారుల కష్టాలు కొనసాగుతున్నాయి.ఎన్నికల కమిషన్(Election Commission) ఆదేశాల మేరకు ఈనెల ఫించన్ నగదును రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ఖాతాల్లో డబ్బులు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు (Elderly , disabled)బ్యాంకులకు బారులు తీరారు.మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారంటూ పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కేవైసీ అప్డేట్(KYC Update) కాని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అలాగే కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకుల్లో సర్వర్లు పని చేయకపోవడంతో బ్యాంకు వద్దే పడిగాపులు పడుతున్న పరిస్థితి నెలకొంది.