తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రైటర్ త్రివిక్రమ్…( Trivikram ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఒకప్పుడు మంచి విజయాన్ని సాధిస్తూ ఉండేవి…ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం( Guntur Karam ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.దాంతో ఆయన మీద నెగిటివ్ అభిప్రాయం అయితే ఏర్పడింది.
ఇక ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో( Allu Arjun ) ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ రొటీన్ ఫార్ములాతో సాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వెరైటీ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను మరోసారి తను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన చేసిన సినిమాలన్నింటిని పక్కన పెడుతూ ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సినిమా చేసి మెప్పిస్తాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మరి త్రివిక్రమ్ ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను దింపబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక అందులో ఒకరు పూజా హెగ్డే( Pooja Hegde ) కాగా మరొకరు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్( Kriti Sanon ) గా తెలుస్తుంది.ఈసారి తను ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో రాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో కనక త్రివిక్రమ్ సూపర్ సక్సెస్ అందుకుంటే ఆయనను మించిన హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలా మరి ఈ సినిమాతో అయినా త్రివిక్రమ్ మంచి సక్సెస్ ని అందుకొని బాధపడతారో లేదో.








