తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేశ్( Venkatesh ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఫ్యామిలీ హీరోగా తను మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తనదైన రీతిలో నటించి మెప్పించే నటుడు మరొకరు లేరు అనేంతలో కూడా నటనతో మెస్మరైజ్ చేశాడు.
ఇక ఫ్యామిలీ సినిమాలోని ఆయన మించిన నటుడు కూడా మరొకరు లేరనే చెప్పాలి.
![Telugu Anil Ravipudi, Anilravipudi, Item, Shruti Haasan, Tollywood, Venkatesh-Mo Telugu Anil Ravipudi, Anilravipudi, Item, Shruti Haasan, Tollywood, Venkatesh-Mo](https://telugustop.com/wp-content/uploads/2024/04/Star-heroine-shruti-haasan-item-song-in-Anil-Ravipudi-Venkatesh-movie-detailsa.jpg)
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకునే క్రమంలో ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు ఈయన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని నమోదు చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
గత సంవత్సరం బాలయ్య బాబుతో చేసిన భగవత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక దాంతోపాటుగా ఇప్పుడు వెంకటేష్ తో చేయబోయే సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించాలనే ఆలోచనలో కూడా అనిప్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే శృతిహాసన్( Shruti Haasan ) గా తెలుస్తోంది.
![Telugu Anil Ravipudi, Anilravipudi, Item, Shruti Haasan, Tollywood, Venkatesh-Mo Telugu Anil Ravipudi, Anilravipudi, Item, Shruti Haasan, Tollywood, Venkatesh-Mo](https://telugustop.com/wp-content/uploads/2024/04/Star-heroine-shruti-haasan-item-song-in-Anil-Ravipudi-Venkatesh-movie-detailss.jpg)
ఇక ఇప్పటికే శృతిహాసన్ సలార్ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది.మరి ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది… ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి వెంకటేష్ తో హ్యాట్రిక్ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎంతవరకు ప్రేక్షకులు మెప్పిస్తుంది అనేది… ఇంతకుముందు వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ అదే తరహాలో ఈ సినిమా కూడా ఆడుతుందా లేదా ఫ్లాప్ గా మిగులుతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
.