బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) మండిపడ్డారు.బీజేపీ నేతలు( BJP Leaders ) అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని మోదీ( PM Modi ) తుంగలో తొక్కారని ఆరోపించారు.పీవీ నరసింహారావును( PV Narasimha Rao ) ప్రధానిని చేసింది తమ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అని జగ్గారెడ్డి తెలిపారు.
పీవీకి భారతరత్న అవార్డు ఇచ్చి బీజేపీ గొప్పులు చెప్పుకుంటోందన్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు విలువలు లేవన్న ఆయన చిల్లర రాజకీయాలు చేస్తారంటూ విమర్శించారు.
ఇక కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్క్రిప్ట్ లీడర్ అని ఎద్దేవా చేశారు.మరోవైపు దమ్ములేని ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ బరిలో దింపిందన్నారు.అధికారం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని విమర్శలు చేశారు.







