ఎండలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
అధిక ఎండల కారణంగా ఆరోగ్యంతో పాటు చర్మం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది.ముఖ్యంగా ఎండల్లో తిరిగినప్పుడు ముఖం మెడ నల్లగా కాంతిహీనంగా మారిపోతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెట్టి మళ్ళీ చర్మాన్ని మామూలు స్థితికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం 20 నిమిషాల్లో అటువంటి చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ సూపర్ గా వర్కోట్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు ( Papaya slices )వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ మరియు చిటికెడు పసుపు( Turmeric ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా తడి లేకుండా చర్మాన్ని తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే ఎండల వల్ల నల్లగా మారిన ముఖం మరియు మెడ నిమిషాల్లో రిపేర్ అవుతుంది.
చర్మం పై పేరుకుపోయిన డస్ట్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ పూర్తిగా రిమూవ్ అవుతాయి.టాన్ తొలగిపోతుంది. చర్మం మళ్లీ తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అందంగా మెరుస్తుంది.
కాబట్టి ప్రస్తుత వేసవి కాలంలో ఎండల వల్ల స్కిన్ డార్క్( Dark skin ) గా మారిందని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







