బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చాలానే శ్రమించారు టిడిపి అధినేత చంద్రబాబు.( Chandrababu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళిపోతున్నాయి.ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.బిజెపితో ( BJP ) పొత్తు విషయంలో ముందుగా చంద్రబాబు చాలా అంచనాలతోనే ఉండేవారు.బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని, అప్పట్లో బీజేపీ సహకారంతో ఏ విధంగా గట్టెక్కామో ఇప్పుడూ అదే విధంగా జరుగుతుందని, లేకపోతే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే భయం చంద్రబాబులో కనిపించింది.2019లో టిడిపి ఒంటరిగానే పోటీ చేసి కేవలం 23 స్థానాలకే పరిమితం అయిపోయింది.
దీంతో మరోసారి ఆవిధమైన పరిస్థితులు ఏర్పడకుండా టిడిపి, జనసేన లను కలుపుకుని ఎన్నికలకు వెళ్తే తమ విజయాన్ని ఎవరూ ఆపలేరనే అంచనాతో చంద్రబాబు ఉంటూ వచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి నుంచి ఊహించిన విధంగా సహకారం లభించకపోవడం, చంద్రబాబుకు అసంతృప్తిని కలిగిస్తోంది.వాస్తవంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు దూరమవుతాయనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.
అంతేకాదు బిజెపికి ఏపీలో అంతంతమాత్రంగానే ఓట్ బ్యాంకు ఉంది.అయినా ఆ పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడడానికి కారణాలు చాలానే ఉన్నాయి.గత ఎన్నికల్లో టిడిపికి( TDP ) విరాళాలు ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారు.
బిజెపి, టిడిపిలు అప్పట్లో కలిసి లేకపోవడం, విడివిడిగా ఎన్నికలకు వెళ్లడంతో టిడిపి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది.అయితే ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడం పైనే టిడిపి దృష్టి సారించింది.వైసిపి( YCP ) డబ్బులు పంచకుండా చేయగలిగితే తాము విజయం సాధించినట్లేనన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు.
దీనికోసమే బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారు.అంతేకాదు వైసీపీకి పరోక్షంగా సహకారమందిస్తున్న కీలకమైన ఉద్యోగులను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా చేసుకునేందుకు వీలు పడుతుందని అంచనా వేశారు.
ఇప్పటికే ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పైన,( Jawahar Reddy ) డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పైన( DGP Rajendranath Reddy ) టిడిపి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
వారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే వారిని తప్పించాలని కోరింది.దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కేంద్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం, ఈ విషయంలో బిజెపి సహకారం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సభలో జగన్ ను పెద్దగా విమర్శించకపోవడం, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.కేంద్ర బిజెపి పెద్దలు ఎవరూ ఏపీలో కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవడం వంటివన్నీ చంద్రబాబుకు అసహనాన్ని కలిగిస్తున్నాయి.
దీంతో బీజేపీ తమతో పొత్తు పెట్టుకున్నా.పరోక్షంగా వైసిపికి సహకారం అందిస్తుందా అనే అనుమానాలు చంద్రబాబులో మొదలయ్యాయట.