టెక్స్ టైల్ పార్కులోని వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి పరిశీలన...కలెక్టర్ అనురాగ్ జయంతి

గడువులోగా యూనిఫాం క్లాత్ అందించాలి .రాజన్న సిరిసిల్ల జిల్లా :నిర్దేశిత గడువులోగా స్కూల్ యూనిఫాం క్లాత్ అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.తంగళ్లపల్లి మండలంలోని టెక్స్ టైల్ పార్కులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కుట్టించే స్కూల్ యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేసే వస్త్ర పరిశ్రమలో కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా దారం నుంచి మొదలుకొని బట్ట ఉత్పత్తి వరకూ వివిధ దశలు క్షుణ్ణంగా పరిశీలించారు.

 Product Inspection In Textile Industry In Textile Park Collector Anurag Jayanthi-TeluguStop.com

బట్ట తయారీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నాణ్యతను తెలుసుకున్నారు.కార్మికులతో మాట్లాడి తయారీ పై మరిన్ని వివరాలు తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ స్కూల్ యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేయాలని సూచించారు.

గడువులోగా క్లాత్ ను కట్టించేందుకు అందించాలని ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మొత్తం 1,15,816 యూనిఫాంలు కుట్టించనున్నారు.

మహిళా సంఘాల బాధ్యులు 768 మందికి ఉపాధి లభించనుంది.ఇక్కడ టెక్స్టైల్ ఆర్డీడీ అశోక్ రావు, ఏడీ సాగర్, డీఆర్డీఓ శేషాద్రి, డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్ సీ సందర్శన తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్ సీ కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు.ఈ సందర్భంగా దవాఖానకు వస్తున్న ఓపీ వివరాలు తెలుసుకున్నారు.

ఆరోగ్య మహిళా కింద ఎంత మందికి పరీక్షలు చేశారు? వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని డాక్టర్ ను అడిగారు.అనంతరం దవాఖానకు నిత్యం ఎంత మంది రోగులు వస్తున్నారు? వారికి ఏ ఏ పరీక్షలు చేస్తున్నారు, వడ దెబ్బ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు.ఓఆర్ఎస్ పాకెట్స్ నిల్వల వివరాలు సే కరించారు.అనంతరం క్యాన్సర్, బీపీ, షుగర్ పేషంట్స్ ఎవరైనా ఉన్నారా.వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.గత నెలలో ఎన్ని డెలివరీలు అయ్యాయని తెలుసుకోగా, 23 అయ్యాయని, 14 ప్రభుత్వ ఆసుపత్రిలో, 9 ప్రైవేటు ఆసుపత్రిలో అయినట్లు వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇక్కడ డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి, డీడీఎం కార్తీక్, మెడికల్ ఆఫీసర్ రేఖ, ఎంఎల్ హెచ్ పీ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube