పవన్ ఫ్యాన్స్ లేకపోతే చిరు సినిమాలు ఆడవు.. గ్రంథి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిరంజీవి సినిమాకు టాక్ పాజిటివ్ గా వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.

 Grandhi Srinivas Shocking Comments About Chiranjeevi Become Hot Topic Details, G-TeluguStop.com

అయితే పవన్ ఫ్యాన్స్ లేకపోతే చిరు సినిమాలు ఆడవు అంటూ గ్రంథి శ్రీనివాస్( Grandhi Srinivas ) షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

గ్రంథి శ్రీనివాస్ చేసిన కామెంట్లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయంటూ నెటిజన్లు చెబుతున్నారు.

చిరంజీవి టికెట్ రేట్ల పెంపు కోసం జగన్ ను కలవడంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన ఫ్యాన్స్ కు చిరంజీవి సినిమాలు చూడవద్దని చెప్పారని అప్పటినుంచి మెగాస్టార్ సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రావడం లేదని ఆయన వెల్లడించారు.మెగాస్టార్ చిరంజీవి పక్కా కమర్షియల్ అని గ్రంథి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

పవన్ ప్రాపకం కోసం మాత్రమే చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారే తప్ప అంతకు మించి మరే కారణం లేదని గ్రంథి శ్రీనివాస్ వెల్లడించారు.జనసేనకు చిరంజీవి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారని విశ్వంభర సినిమాకు( Vishwambhara Movie ) పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ అవసరం కావడంతో ఆయన ఈ విధంగా చేశారని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు.

గ్రంథి శ్రీనివాస్ కామెంట్ల గురించి మెగా ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి స్థాయిని తగ్గించేలా గ్రంథి శ్రీనివాస్ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.చిరంజీవి స్థాయి వేరు స్థానం వేరని ఆయనను విమర్శించవద్దని అభిమానులు కోరుతున్నారు.చిరంజీవి విశ్వంభర సినిమాలో ఒక ఫైట్ సీన్ కోసం ఏకంగా 26 రోజుల సమయం కేటాయించారని సమాచారం అందుతోంది.

విశ్వంభర సినిమా కలెక్షన్ల పరంగా సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube