బోట్ స్ట్రోమ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

ప్రస్తుత కాలంలో యువత స్మార్ట్ వాచ్( Smart Watch ) ల వాడకానికి అధిక ఆసక్తి చూపిస్తూ ఉండడంతో భారత మార్కెట్లో సరికొత్త ఫీచర్లతో ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్లు తరచూ విడుదల అవుతూనే ఉన్నాయి.గతంలో స్మార్ట్ వాచ్ లను కేవలం టైం కోసమే కొనుగోలు చేసేవారు.

 Boat Storm Call 3 Smart Watch Price Is Low.. Features Are More , Boat Storm Call-TeluguStop.com

కానీ ప్రస్తుతం ఫోన్ కాలింగ్, హెల్త్ ట్రాక్ ఇంకా ఇతర ఫీచర్ల కోసం కొనుగోలు చేస్తూ ఉండడంతో మార్కెట్లో స్మార్ట్ వాచ్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.ఈ క్రమంలోనే తాజాగా బోట్ సంస్థ నుండి బోట్ స్ట్రొమ్ కాల్ 3( BoAt Storm Call 3 ) పేరుతో స్మార్ట్ వాచ్ ను లాంఛ్ చేసింది.

ఆ వాచ్ ధరతో పాటు స్పెసిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం.

Telugu Oxygen, Storm, Heart, Smart Watch, Technolgy-Technology Telugu

బోట్ స్ట్రోమ్ కాల్ 3 స్మార్ట్ వాచ్:

ఈ వాచ్ 1.83 అంగుళాల దీర్ఘ చతురస్రాకార డిస్ ప్లే తో వస్తోంది.240*296 పిక్సెల్ రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్ నెస్, బ్లూ టూత్ కాలింగ్, నావిగేషన్ సపోర్ట్ తో ఉంటుంది.ఇక అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా SoS మోడ్ ను కలిగి ఉంది.ఈ వాచ్ 230mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.

Telugu Oxygen, Storm, Heart, Smart Watch, Technolgy-Technology Telugu

బోట్ వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది.హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్( Blood oxygen monitor ), స్లీప్ సైకిల్ ట్రాకర్ లాంటి ట్రాకర్లను కలిగి ఉంటుంది.అత్యవసర సమయాల్లో స్మార్ట్ వాచ్ లో ముందస్తుగానే నమోదు చేసిన వ్యక్తులను ఫోన్ నెంబర్లకు సమాచారం అందిస్తుంది.700+ ప్రీ ఇన్ స్టాల్ట్ యాక్టివిటీ మోడ్ లను కలిగి ఉంది.ఈ స్మార్ట్ వాచ్ సిల్వర్ మెటల్, యాక్టివ్ బ్లాక్, డార్క్ బ్లూ, చెర్రీ బ్లోసమ్, ఓలివ్ గ్రీన్ లాంటి వేరియంట్లలో లభిస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే.ప్రారంభ ధర రూ.1099 కాగా.సిల్వర్ మెటల్ వేరియంట్ ధర రూ.1249 కాగా.ఇక మిగిలిన వేరియంట్ల ధరలు రూ.1588, రూ.1694 గా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube