ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసింది.ఈ రాయి దాడి ఘటనలో భాగంగా నిందితులను పోలీసులు అరెస్టు చేసే రిమాండ్ కి తరలించారు.
ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుంది ఇలాంటి తరుణంలోనే యాంకర్ మంజుషా( Manjusha ) సీఎం పై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టీవీ 5 మూర్తి ( Murthy ) దర్శకుడిగా మారి హీరో నారా రోహిత్( Nara Rohith) ప్రధాన పాత్రలో ప్రతినిధి 2( Prathinidhi ) సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో టీవీ5 మూర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా మంజూష ఈయన ప్రశ్నిస్తూ మీ సినిమాలో హీరో కుడి కంటి పై దెబ్బ తగిలింది.అలాగే నిజ జీవితంలో కూడా సీఎం జగన్ పై దెబ్బ తగిలింది.ఇది సీఎం గారికి దెబ్బ తగలకముందే తీశారా లేక అంతకుముందే తీసారా అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మూర్తి సమాధానం చెబుతూ.రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదని చెప్పాలి ఇక్కడ హీరో కుడి కంటికి తగలగా అక్కడ సీఎం ఎడమ కంటికి తగిలింది.

ఈ సీన్ ఇప్పుడు కావాలని తీసింది కాదు.సీఎం గారిపై ఎటాక్ చేయడానికి ముందే తీశాం.రాజకీయ నాయకులపై రాళ్లు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పిన జర్నలిస్ట్‌లపై కూడా రాళ్లు వేశారు.ఇలా రాళ్ల పడటం సర్వసాధారణం ఈ సినిమా చూసిన తర్వాత నాపై కూడా రాళ్లు పడతాయని ఈయన తెలిపారు.
అనంతరం మంజుషా సీరియస్‌గా మొహం పెట్టి.హో.డైరెక్ట్‌గా గులకరాయి అయితే కాదు కదా అంటూ ఈమే సీఎంని కొట్టమని గులకరాయి అందించినట్టుగా హేళనగా నవ్వింది.దీంతో వైసిపి అభిమానులు యాంకర్ మంజుషా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే గులకరాయి వేసిన వాళ్ళు దొరకారు.వేయించిన వాళ్ళు తొందరలోనే దొరుకుతారు అప్పటివరకు మీ డ్రామాలు ఆపండి అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.