రాజన్న సిరిసిల్ల జిల్లా :చాక్ పీసుల( chalk piece )తో సూక్ష్మ కళాత్మక వస్తువులు తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు విద్యార్థి అజయ్.చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాస్ -సుజాత దంపతుల కుమారుడు అజయ్( Ajay ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
ఇంట్లో సాయంత్రం చదువుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా తనకున్న ఆసక్తికి పదును పెట్టి పెద్ద పెద్ద వస్తువులను కూడా చిన్న చిన్న చాక్ పీస్ పైన విమానం, రాకెట్, హెలికాప్టర్ ,టిప్పర్, స్టీమర్, పడవ ,ఓడ,యుద్ద క్షిపణి, కారు, జీబు, లారీ, గొలుసు ఇవే కాకుండా దాదాపు 200 రకాలైనటువంటి మైక్రో వస్తువులు చాక్ పీస్ లతో తయారు చేయడమే కాకుండా శంకరుడు పార్వతి, గణపతి ,కృష్ణుడి, హనుమంతుడి దేవతల చిత్రాలు మహాద్భుతంగా గీస్తూ అజయ్ గ్రామస్తుల చేత శభాష్ అనిపించుకున్నాడు.చిన్నతనం నుండి చాక్ పీస్ లతో ఎన్నో ఆకృతులు తయారు చేయడం చిత్రాలు గీయడం అంటే ఇష్టమని తల్లిదండ్రులు అక్కయ్య చాలా సంతోషిస్తున్నారు.