టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా రుహాని శర్మకు( Ruhani Sharma ) మంచి గుర్తింపు ఉంది.చి ల సౌ సినిమాతో టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రుహాని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు( Anushka Sharma ) చెల్లి వరస అవుతారు.
అనుష్క శర్మతో ఉన్న అనుబంధం గురించి ఇతర విషయాల గురించి చెప్పడం నాకు ఇష్టం లేదని రుహాని శర్మ తెలిపారు.అది పూర్తిగా నా వ్యక్తిగత విషయమని అంతకు మించి చెప్పలేనని రుహాని శర్మ పేర్కొన్నారు.
నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని పంజాబీలో( Punjabi ) ఓ వీడియో ఆల్బం చేసిన తర్వాత కొన్ని యాడ్ ఫిల్స్మ్( Ad films ) లో చేశానని ఆమె తెలిపారు.ఆ సమయంలో నటనపై ఆసక్తి కలిగిందని రుహాని శర్మ అన్నారు.
ఆ తర్వాత హిట్2, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు సినిమాలలో నటించానని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మంచి సినిమాలు చేయాలని నటిగా పేరు తెచ్చుకోవాలని నేను భావిస్తానని ఆమె తెలిపారు.
కొన్ని సినిమాలు జనానికి నచ్చవచ్చని మరికొన్ని సినిమాలు నచ్చకపోవచ్చని ఆమె అన్నారు.సక్సెస్ ఫెయిల్యూర్ నుంచి నేను నేర్చుకుంటూనే ముందుకు వస్తున్నానని రుహాని శర్మ పేర్కొన్నారు.నా చెల్లెలికి సినిమాల గురించి అవగాహన ఎక్కువని ఎలాంటి పాత్రలు చేయాలో చెల్లి సలహాలు ఇస్తుందని ఆమె వెల్లడించారు.సరదాగా ఉండే పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని రుహాని శర్మ పేర్కొన్నారు.
కంటెంట్ కు, పాత్రకు నేను ప్రాధాన్యత ఇస్తానని రుహాని శర్మ తెలిపారు.సినిమా అంటేనే గ్లామర్ అని అయితే అది మితిమీరకుండా ఉంటే బాగుంటుందని ఆమె అన్నారు.వల్గారిటీకి మాత్రం దూరంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.టాలీవుడ్ నటి రుహాని శర్మను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.