ఐపీఎల్ సీజన్ 17 ( IPL Season 17 ) లో భాగంగా ప్రతి టీమ్ కూడా తమ సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఒక టీమ్ మాత్రం ఇప్పటివరకు వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళుతుంది.అది ఏ టీం అంటే రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals )… గత సీజన్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికి, ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వని ఈ టీం ఈసారి మాత్రం బరిలోకి దిగింది.
అందులో భాగంగానే నాలుగు మ్యాచ్ లు గెలిచి తమ సత్తా ఏమిటో చూపించుకుంది.ఇక రీసెంట్ గా బెంగళూరు టీమ్ ( Bangalore team ) మీద ఆడిన మ్యాచ్ లో జోస్ బట్లర్( Jose Butler ) సెంచరీ చేసి టీం ని దగ్గరుండి మరి విజయతీరాలకు చేర్చడం అనేది ఆ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకు తెలియజేస్తుంది.ఇక గత మూడు మ్యాచ్ ల్లో బట్లర్ పెద్దగా తన ప్రభావాన్ని చూపించలేదు.అయినప్పటికీ తను ఏదో ఒక మ్యాచ్ లో ఫామ్ లోకి వస్తాడనే ఉద్దేశ్యం తో టీం మొత్తం ఆయన మీద మంచి అంచనాలను పెట్టుకున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే నిన్న ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో బట్లర్ సెంచరీ చెడమే కాకుండా ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే టీమ్ ని విజయతీరాలకు చేర్చాడు.ఇక మాజీ సీనియర్ ప్లేయర్లందరూ ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నిజానికి ఐపీఎల్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరం అంటే 2008వ సంవత్సరంలో రాజస్థాన్ మొదటి సీజన్ లోనే కప్పు కొట్టింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు కోట్టకపోవడం ఆ టీమ్ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంది.కాబట్టి ఈసారి సంజు శాంసన్ ( Sanju Samson ) సారథ్యంలో ఆర్ ఆర్ టీం కప్ప కొడుతుందని ఆ టీమ్ యాజమాన్యం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.