ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు( TDP MLA Rama Raju ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉండి నియోజకవర్గ టికెట్ పై పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) వద్ద చర్చ జరగలేదని తెలిపారు.
ఉండి నియోజకవర్గ( Undi Constituency ) సీటును ఇప్పటికే పార్టీ తనకు కేటాయించిందని పేర్కొన్నారు.కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉండి సీటుపై మొదటి నుంచి లేనిపోని అలజడి సృష్టిస్తున్నారని తెలిపారు.పార్టీ అధిష్టానం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న రామరాజు తాను పోటీలో ఉన్నట్లేనని వెల్లడించారు.