ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) పేరు కూడా ఒకటి.తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అంటే మృణాల్ ఠాకూర్.
హిందీలో పలు సినిమాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న మృణాల్.దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం చిత్రంతో( Sitaramam ) తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.ఈ మూవీలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు.
సీతారామం సినిమా కూడా ఘన విజయం సాధించడమే కాకుండా మృణాల్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది.ఇక రెండో సినిమాగా హాయ్ నాన్న( Hi Nanna ) మూవీలో నాని సరసన నటించింది మృణాల్.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది మంచి విజయం సాధించింది.ఇలా తెలుగులో నటించిన మొదటి రెండు సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకోవడంతో ఇదే జోష్ లో మృణాల్ హ్యాట్రిక్ కొడుతుందని భావించారు అందరూ.
కానీ ఆమెకు మూడో సినిమాతో షాక్ తగిలింది.విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్( Family Star ) తాజాగా ఏప్రిల్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే మొదటి షో నుంచే ఈ సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.వరల్డ్ వైడ్ గా రూ.43 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ టాక్ తో బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు అసాధ్యమే.అదే జరిగితే మృణాల్ కి తెలుగులో మొదటి ఫ్లాప్ ఎదురై, హ్యాట్రిక్ కి బ్రేక్ పడినట్లే.
మరి ఈ ముద్దుగుమ్మ ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈమె కెరియర్ డేంజర్ లో పడినట్టే అంటున్నారు అభిమానులు.