ఈ మధ్యకాలంలో చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం చోరీలు మొదలుపెట్టారు కొందరు కేటుగాళ్లు.ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశలలో, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్లో లాంటి ప్రదేశంలో కాపు కాచి చోరీలను చేపడుతున్నారు.
ముఖ్యంగా ముసలి వాళ్ళను, మహిళలను టార్గెట్ చేసుకొని కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు.ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో( Marriage ). లేక ఏదైనా అవసరం కొద్దీ కొందరు మహిళలు బంగారు ఆభరణాలను ధరించి బస్సులు, రైలలో ప్రయాణం చేస్తుంటారు.ముఖ్యంగా కిటికీల వద్ద కూర్చున్న వారిని కొందరు టార్గెట్ చేసి దొంగతనం చేస్తుంటారు.

ముఖ్యంగా బస్సులు, రైలు కదులుతున్న సమయంలో ఇలాంటి చోరీలకు ఎక్కువ అవకాశం ఉంది.మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ఇట్టే తెంపేసుకుని సెకండ్లలో పరారవుతారు.ఇదివరకు ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా రైలులో చూస్తూ ఉంటాం.ఇలాంటి ఘటనలు ఎక్కువగా రాత్రి సమయాల్లో జరుగుతూ ఉంటాయి.కాకపోతే ప్రస్తుతం పట్టపగలు రైలు ప్రయాణం( Train Journey ) చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి మహిళ మెడలోని గొలుసును తెంచుకొని మరి ట్రైన్ నుండి దూకేసి తప్పించుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఒక యువకుడు పక్క ప్లాన్ ప్రకారం రైలులో ఎగ్జిట్ డోర్( Exit Door ) వద్ద నిలబడి ఉండగా.రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుంది.అయితే అదే సమయంలో వాష్ రూమ్ కి వచ్చిన మహిళలను టార్గెట్ చేశాడు ఆ యువకుడు.మహిళలు వాష్ రూమ్ నుండి బయటకు రాగానే అమాంతం మహిళ మెడలో చేయి వేసి సెకండ్ల వ్యవధిలో ఆమె మంగళసూత్రం( Mangalasutram ) లాగేసుకొని రైలు నుంచి కిందికి దూకేశాడు.
అయితే తాళిబొట్టు తెంచే సమయంలో సదరు మహిళ ప్రతిఘటించిన అది సరిపోలేదు.ఈ సంఘటన సంబంధించిన ఆధారాలు రైలులోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







