తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడుగా ఎదిగాడు.ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూనే తనకంటూ ఉన్న గుర్తింపును రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన సత్తా చాటుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి, కీరవాణి, కాంచీ, కళ్యాణ్ మాలిక్ వీళ్లంతా బ్రదర్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే.
ఇక వీళ్లంతా చిన్నప్పటినుంచి ఒకే కుటుంబంలో కలిసి పెరిగారు.కాబట్టి వీళ్ళ మధ్య మంచి అన్యోన్య భావన కూడా ఉంది.

ఇక అందులో భాగంగానే రాజమౌళి చిన్నప్పటినుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కథలు చెబుతూ ఉండేవాడట.ఇక అందులో భాగంగానే కీరవాణి తమ్ముడు అయిన కాంచీ కి ( Kanchi ) ఒకరోజు అద్భుతమైన కథ చెప్పాడట.అది ఫుల్లీ హాలీవుడ్ సినిమాల( Hollywood Movies ) ఉండడమే కాకుండా ఒక్కొక్క సీను తన కళ్ళకు కట్టినట్టుగా రాజమౌళి చెప్పడం అనేది ఆయన ఎప్పటికీ మర్చిపోలేడట.అంత హైలీ టాలెంటెడ్ తో అప్పుడే రాజమౌళి సూపర్ డూపర్ స్టోరీలను చెబుతూ మా అందరిని ఎంటర్ టైన్ చేసేవాడు అంటూ కాంచీ రాజమౌళి గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు.

రాజమౌళి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా ఎదగడం అనేది నిజంగా గ్రేట్ అనే విషయాన్ని కూడా చెబుతూ వచ్చాడు.ఇక కాంచీ రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమాకి కథను అందించడం విశేషం.ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా తన కథలను అందించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటికి కూడా రాజమౌళి సినిమాకి కథ సహకారాలను అందిస్తున్న రాజమౌళితోనే కాంచీ ట్రావెల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాతో తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు…
.