సింగపూర్‌లో( Singapore ) భారత సంతతికి చెందిన మాజీ రవాణా మంత్రి ఎస్ ఈశ్వరన్‌పై( S Iswaran ) సోమవారం ఎనిమిది కొత్త అభియోగాలు నమోదయ్యాయి.వీటితో కలిపి ఆయన ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అభియోగాల సంఖ్య 35కి చేరుకుంది.61 ఏళ్ల ఈశ్వరన్ కొత్త అభియోగాలపై స్పందిస్తూ.తాను నిర్దోషినంటూ పేర్కొన్నారు.
అతని అనారోగ్యం కారణంగా పొడిగించిన ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని సింగపూర్ వచ్చిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.శిక్షాస్మృతిలోని సెక్షన్ 165 కింద ఈ 8 కొత్త అభియోగాలు నమోదు చేశారు.
ఆయన లంకోక్ సెంగ్( Lum Kok Seng ) అనే వ్యక్తి నుంచి విస్కీ సీసాలు, బ్రోంప్టన్ సైకిల్ సహా విలువైన వస్తువులను పొందినట్లు ఆరోపణలు వున్నాయని ఛానెల్ న్యూస్ ఆసియా నివేదించింది.ఈ వస్తువుల మొత్తం విలువ 18,956.94 సింగపూర్ డాలర్లుగా కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) సోమవారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.
రవాణా మంత్రిగా( Transport Minister ) వున్న సమయంలో ఈశ్వరన్ .లాం చాంగ్ బిల్డిం కాంట్రాక్టర్ల కంపెనీ ద్వారా ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎల్‌టీఈ)తో( Land Transport Authority ) జరిగిన వ్యాపారాన్ని డీల్ చేసినప్పుడు ఈ లావాదేవీలు జరిగినట్లుగా సీపీఐబీ పేర్కొంది.నవంబర్ 2021 నుంచి నవంబర్ 2022 మధ్యకాలంలో ఈశ్వరన్.
లాం నుంచి విలువైన బహుమతులను పొందినట్లుగా తాజా అభియోగాల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం వున్న తనహ్ మేరా (మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్) స్టేషన్‌కు, ఇప్పటికే వున్న వయాడక్ట్‌లకు అదనంగా మార్పు పనులకు సంబంధించి టీ315 కాంట్రాక్ట్ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈశ్వరన్‌ను 2023 జూలై 11న కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ)( Corrupt Practices Investigation Bureau ) అరెస్ట్ చేయగా, బెయిల్‌పై విడుదలయ్యారు.ఆయన ప్రస్తుతం సెలవులో వుండగా.తదుపరి నోటీసు వచ్చే వరకు ఈశ్వరన్ నెలవారీ వేతనం 8,500 సింగపూర్ డాలర్లకు తగ్గించబడింది.అయినప్పటికీ తన ఎంపీ అలవెన్స్‌ను డ్రా చేస్తూనే వున్నారు.స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.
రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.అలాంటి వ్యక్తి విచారణను ఎదుర్కొంటూ వుండటంతో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగపూర్‌లో 2025లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చు.1965లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సింగపూర్‌ను పీఏపీ పరిపాలిస్తోంది.