సూర్యాపేట జిల్లా: జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెర్వు, చింతలపాలెం,మఠంపల్లి మండలాల్లో ఎక్సైజ్ శాఖా అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.ఎన్నికల కోడ్ దృష్ట్యా జరిపిన తనిఖీల్లో చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాకు చెందిన ఆంగోతు గోపి మరియు పద్యప్రసాద్ రఘునాథపాలెంకు 6 లీటర్ల సారా తరలిస్తుండగా సారాతో పాటు హీరో స్ప్లెండర్ బండి సీజ్ చేశామని,
ఇదే తండాకు చెందిన గుగులోతు రమేష్ ఇంటిలో నిల్వ చేసిన 5 లీటర్ల సారా,200 కిలోల బెల్లంతో పాటు, 800 లీటర్ల బెల్లం వాష్ ను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశామన్నారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు జగన్మోహన్ రెడ్డి,దివ్య,సిబ్బంది నాగరాజు, రుక్మారెడ్డి,నరేష్,ధనుంజయ్ పాల్గొన్నారు.